ప్రతిజ్ఞ

   భారతదేశం నా మాతృభూమి.  భారతీయులందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను.  సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను,పెద్దలందరిని గౌరవిస్తాను.  ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.  నా దేశం పట్ల, నా ప్రజల పట్ల,  జంతువుల పట్ల సేవానిరతితో ఉంటానని  ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము.

Comments

Popular posts from this blog