ముందుమాట ఏ పనినైనా సాధించాలంటే దృఢమైన సంకల్పం అవసరం. అటువంటప్పుడు సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా భాష అవసరము. శ్రీ కృష్ణదేవరాయలవారు చెప్పినట్లు భాషలలో తేనె కంటే తియ్యనైన “తెలుగు భాష” మరెంతో మధురము. ఇటువంటి మధురమైన భాషను విద్యార్థుల నుండి వృద్ధుల వరకు అందరికి ఉపయోగపడేలా సులువుగా పాఠాలు అందించేందుకే మా ఈ ప్రయత్నం. తెలుగును నిర్లక్ష్యం చేయడం వలన మనలోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేము అంతే కాకుండా ఆంగ్ల మాధ్యమ భ్రమలో పడి, తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు. తెలుగు భాషా నైపుణ్యాలను మరింత వెలికి తీసేందుకు మరింత కృషి చేస్తున్నాము.
Posts
Showing posts from August, 2018